Hyderabad: తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు ఉదయం 9.30 గంటలకు జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే ఈ భేటీలో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
ఉదయం 11.14 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇది భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న మూడో బడ్జెట్ కావడం విశేషం.
ఈసారి రూ. 3.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ బడ్జెట్‌లో కొత్త సంక్షేమ పథకాలు, నూతన ప్రణాళికలు ఉండే అవకాశంఉంది.