Anupama Parameswaran: శతమానం భవతి సినిమాలో శర్వానంద్, అనుపమ హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుటైంది. 2017లో వచ్చిన సినిమా సినిమా తర్వాత అనుపమ చాలా సినిమాల్లో నటించింది కానీ మళ్ళీ శర్వానంద్ తో సినిమా చేయలేదు. తాజాగా మళ్లీ ఈ జంట ఇన్నేళ్లకు ఓ సినిమాలో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారని టాక్. రీసెంట్ గానే ఈ సినిమా కోసం మూవీ టీం అనుపమని సంప్రదించారని తెలుస్తోంది. అనుపమ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తిగా ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇక రెండోసారి ఈ జంట కలవబోవడంతో వీరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి మరోసారి వీరి కలయిక ఎలా మెప్పిస్తుందో చూడాలి.
