Spacex Starship

Spacex Starship: వరుసగా రెండోసారి.. మళ్ళీ పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్

Spacex Starship: స్పేస్‌ఎక్స్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టెక్సాస్‌లోని బోకా చికా నుండి నింగిలోకి ఎగిసిన స్టార్‌షిప్ రాకెట్ అంతరిక్షంలోనే పేలిపోయింది. 403 అడుగుల (123 మీటర్లు) పొడవైన ఈ రాకెట్ వ్యవస్థ సాయంత్రం 6:30 గంటలకు (ET) నింగిలోకి దూసుకెళ్లింది. సూపర్‌ హెవీ బూస్టర్ విజయవంతంగా భూమికి తిరిగి చేరుకుంది. అయితే, ప్రయోగించిన కొద్ది నిమిషాలకే స్టార్‌షిప్ పైభాగం నియంత్రణ కోల్పోయింది. రాకెట్ ఇంజన్లు ఆగిపోయాయి. స్పేస్‌ఎక్స్ సంస్థ రాకెట్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ ప్రయోగం విఫలమైంది.

Also Read: SRH: ఐపీఎల్ కు ముందు సన్ రైజర్స్ కు ఎదురు దెబ్బ..! ఏరికోరి కొనుక్కున్న ప్లేయర్ అవుట్..!

Spacex Starship: బహామాస్, దక్షిణ ఫ్లోరిడా నుండి వచ్చిన వీడియోలలో మంటలతో కూడిన శిథిలాలు ఆకాశంలో దూసుకుపోతున్నట్లు కనిపించాయి. 2025లో స్టార్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఇది వరుసగా రెండవ వైఫల్యం. జనవరిలో కూడా ఇలాంటి పేలుడే సంభవించింది. అంతరిక్ష శిథిలాల కారణంగా ఫ్లోరిడాలోని విమానాశ్రయాలలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ స్టాప్‌లను జారీ చేసింది.

ఈ వైఫల్యం ఉపగ్రహాల మోహరింపుతో పాటు చంద్రుడు, అంగారకుడికి మానవ మిషన్ల కోసం స్టార్‌షిప్‌ను అభివృద్ధి చేయాలనే ఎలోన్ మస్క్ ప్రతిష్టాత్మక ప్రణాళికలను దెబ్బతీసింది. స్పేస్‌ఎక్స్ వేగవంతమైన అభివృద్ధి లక్ష్యాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఈ వైఫల్యం స్పేస్‌ఎక్స్ విశ్వసనీయతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో, స్పేస్‌ఎక్స్ రాబోయే ప్రయోగాల కోసం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Farmers Protest: రైతుల ఆందోళనతో మూతపడ్డ రోడ్డు తెరుచుకుంది.. 13 నెలల తరువాత ప్రారంభమైన వాహనాల రాకపోకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *