RC16: రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో RC16 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా ఆయన ఈ సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతారా అనే విషయంపై స్వయంగా శివ రాజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.ఈ మూవీ షూటింగ్ కోసం శివ రాజ్ కుమార్ మార్చి 5న హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ కొన్ని రోజుల పాటు రామ్ చరణ్ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు శివన్న స్క్రీన్ షేర్ చేసుకునే సీన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని టాక్.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
