Posani Murali Krishna: టాలీవుడ్ నటుడు, వైసీపీ పార్టీ నేత పోసాని కృష్ణ మురళీని ఏపీ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని పోసాని నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఏపీ సీఎం చంద్రాబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఫిర్యాదు నమోదైంది. ఏపీలోని ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసానిపై ఫిర్యాదు నమోదు కావడంతో, ఆయనపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.పోసాని కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని కేసు నమోదైంది. ఇక పోసానిని రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పోసాని అరెస్ట్ వార్త టాలీవుడ్ లో సంచలనం అవుతుంది.

