Nara Lokesh: ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖ చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే నమ్మకం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, భువనేశ్వరి గారి ఆచరణతో ప్రారంభమైన ఈ ట్రస్ట్ 28 ఏళ్లుగా ప్రజాసేవలో అగ్రగామిగా నిలిచింది.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా బాధితుల కోసం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన “యుఫోరియా మ్యూజికల్ నైట్” కార్యక్రమంలో పాల్గొన్నారు.
సేవలో ఎన్టీఆర్ ట్రస్ట్
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, “తలసేమియా బాధితుల కోసం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది” అని అన్నారు.
1997లో స్థాపించబడిన ఎన్టీఆర్ ట్రస్ట్, గత 28 ఏళ్లుగా విద్య, వైద్యం, ఉపాధి, సురక్షిత త్రాగునీరు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తూ, ప్రజల మనస్సును గెలుచుకుంది.ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వానికి ముందుగా ప్రజలకు అండగా నిలిచేది ఎన్టీఆర్ ట్రస్ట్.మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా “స్త్రీ శక్తీ” వంటి కార్యక్రమాల ద్వారా వారిని స్వయం ఉపాధి వైపు నడిపించిందని మంత్రి తెలిపారు.
ఫ్యాక్షన్ బాధితులకు ఆదరంగా…
ఫ్యాక్షన్ హింసకు గురైన అనేక కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశాజ్యోతిగా మారింది. బాధిత కుటుంబాలకు విద్యా, ఆర్థిక సహాయం అందిస్తూ, వారి జీవితాలను మారుస్తోంది.
అనంతపురం జిల్లాకు చెందిన శ్రావణి అనే యువతి తన జీవితంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రభావాన్ని వివరించింది.
“నా తండ్రి ఫ్యాక్షన్ హింసలో మృతి చెందారు. మా ఐదుగురు తోబుట్టువులు ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో చదువుకున్నాం. నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయ్యారు. ఇప్పుడు నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాను” అని చెప్పింది.
మౌనిక అనే యువతి, ఫ్యాక్షన్ హింసలో తన తండ్రిని కోల్పోయింది.ఆమె, ఆమె సోదరి నాగమణి ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో చదివి,నాగమణి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గామౌనిక వ్యవసాయ శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసి తన జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకున్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయం
ఉత్తరాఖండ్ వరదలు, హుద్ హుద్ తుఫాన్, తిత్లీ తుఫాన్, విజయవాడ వరదలు, కర్నూలు వరదలు, గోదావరి వరదల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బాధితులకు అండగా నిలిచింది.
అన్నమయ్య ప్రాజెక్టు కూలినప్పుడు 48 బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించింది.”ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల కష్టాన్ని తొలగించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుంది” అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఆరోగ్య సేవల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి…
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ విస్తృత సేవలు అందించింది.మాస్క్‌లు, మందులు, ఆక్సిజన్ పంపినీ,కోవిడ్ బాధితుల అంత్యక్రియలకు సహాయం,ఇప్పటివరకు 8.70 లక్షల మందికి రక్తదానం, తలసేమియా, జన్యుపరమైన వ్యాధులతో బాధపడుతున్న 200 మంది పిల్లలకు ఉచిత రక్త సరఫరా2,020 మంది అనాథలకు ఉచిత వసతి, విద్య అందించడం
ప్రజాసేవే ధ్యేయంగా…
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారు, ట్రస్ట్ టీమ్, సంగీత దర్శకుడు తమన్, హాజరైన వారందరికీ మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.”సేవ చేస్తూ, సహాయం అందిస్తూ, ప్రతి మనిషి జీవితంలో మార్పు తేవాలనే సంకల్పంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు సాగుతోంది,” అని అన్నారు.