Ramdev Baba: యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
పతంజలి (Patanjali) సంస్థకు చెందిన దివ్య ఫార్మసీ ఉత్పత్తులపై ప్రజల తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు జరగడంతో కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వారి కేసు నమోదు చేశారు.
ఈ కేసులో విచారణకు ఫిబ్రవరి ఒకటో తేదీన హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించగా వారు హజరుకాకపోవడంతో.. బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలపై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన తిరిగి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది..
ఇది కూడా చదవండి: Dal Tadka Recipe: ధాబా స్టైల్‌లో దాల్ తడ్కా ఎలా తయారు చేయాలో తెలుసా ?
ప్రజల తప్పుదోవ పట్టించే ప్రకటనలు నేపథ్యంలో పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ కూడా రద్దయిన సంగతి తెలిసిందే.