Yogi Adityanath:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనలో 15 మంది భక్తులు మృత్యువాత పడగా, సుమారు 50 మందికి పైగా భక్తులు గాయాలపాలయ్యారు. త్రివేణి సంగమంలోని రెండో సెక్టార్ వద్ద ఈ తొక్కిసలాట చోటుచేసుకున్నది.
Yogi Adityanath:మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగరాజ్‌కు ఇప్పటివరకు సుమారు 10 కోట్ల మందికి పైగా భక్తులు తరలివచ్చారని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. నిన్న ఒక్కరోజే 5 కోట్ల మంది పవిత్రస్నానాలు ఆచరించారని తెలిసిందని చెప్పారు. అర్ధరాత్రి దాటాక మౌని అమావాస్య ఘడియలు రాగానే భక్తులు ఒక్కసారిగా బారికేడ్ల ముందుకు వచ్చారని సీఎం తెలిపారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగిందని వివరించారు.
Yogi Adityanath:తొక్కిసలాట చోటుచేసుకోగానే అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితి నియంత్రణలోనే ఉన్నదని చెప్పారు. వదంతులను నమ్మొద్దని, సమీపంలోని ఘాట్‌ను ఉపయోగించుకొని ప్రజలు సహకరించాలని యోగి ఆదిత్యనాథ్ కోరారు.