Supreme Court:

Supreme Court: పాముకాటుకు చికిత్సను ప్రభుత్వమే అందించేలా చర్యలు తీసుకొవాలి.. సుప్రీం కోర్టు ఆదేశం..

Supreme Court: దేశవ్యాప్తంగా పాముకాటుకు గురైన వారికి సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్‌లో మన దేశంలో ఏటా 58,000 మంది పాము కాటుతో మరణిస్తున్నారని పేర్కొన్నారు. యాంటీ-వెనమ్ ఔషధాల కొరత దీనికి కారణంగా ఆయన చెప్పారు. దీనిపై ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో పాముకాటుకు సంబంధించి శిక్షణ పొందిన వైద్యులకు తగిన యాంటీ-వెనమ్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి: Modi- Trump: ట్రంప్ తో మాట్లాడిన మోదీ.. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు!

Supreme Court: ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. సంబంధిత పిటిషన్లను పరిశీలించిన న్యాయమూర్తులు.. ‘పాము కాటు సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత, పాము కాటుతో బాధపడేవారికి అవసరమైన యాంటీ-వెనమ్ తగిన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. ఇక ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదులు సమాధానమిచ్చేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు.దీని ప్రకారం ఆరు వారాల్లోగా సమాధానమిచ్చేందుకు గడువు ఇస్తూ న్యాయమూర్తులు కేసును వాయిదా వేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Amit Shah: అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిలో రికార్డులు సృష్టించాడు..అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *