Building Collapsed

Building Collapsed: కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం.. చిన్నారి మృతి

Building Collapsed: ఢిల్లీలో 4 అంతస్థుల భవనం కుప్పకూలడంతో ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది చాలా సేపు పోరాడి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల మధ్య చిక్కుకుని ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం అవుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

ఇది కూడా చదవండి: Uniform Civil Code: ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులోకి.. అసలు ఈ కోడ్ తో ఏమి మారుతుంది? తెలుసుకుందాం

5 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి ఒక ప్రకటన విడుదల చేశారు.
చిక్కుకుపోయిన ప్రజలకు త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని ఆమె స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత ప్రజలకు అన్ని విధాలా సాయం అందిస్తామన్నారు. భవనం కూలిన ఘటన చాలా బాధాకరం అన్న ఆమె బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *