Bakka Jadson: దావోస్‌కు పోయి తెచ్చినట్టుగా గొప్పగా చెప్పుకుంటున్న పెట్టుబడులపై ఐదేండ్లలో అమలు చేస్తామని బాండ్ పేపర్‌పై సంతకం పెట్టి రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి హామీగా ఇవ్వాలని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్క జడ్సన్ సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ఏకంగా బాండ్ పేపర్‌ను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఆ బాండ్ పేపర్‌పై సీఎంతోపాటు ఐటీ మంత్రి, ఐటీ సెక్రటరీ, ఐటీ సలహాదారు సంతకాలు పెట్టాలని డిమాండ్ చేశారు.
Bakka Jadson: దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు కోట్లు పెట్టి పోయారని బక్క జడ్సన్ తెలిపారు. అక్కడి నుంచి రూ.1.70 లక్షల కోట్లు సూట్ కేసులో పట్టుకొని వస్తున్నాం. మాకు స్వాగతం పలకండి.. అని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఐదేండ్లలో ఈ రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామని తాను తెచ్చిన ఈ బాండ్ పేపర్‌పై సంతకం పెట్టాలని డిమాండ్ చేశారు.
Bakka Jadson: తాము తెచ్చామని చెప్పుకుంటున్న 64 కంపెనీలు ఈ నాలుగేండ్లలో పెట్టకుంటే తనను జైల్లో పెట్టాలంటూ బాండ్ పేపర్‌లో సంతకం పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను తాము మోసం చేయట్లేదని ఈ బాండ్ పేపర్‌పై సీఎంతోపాటు ఐటీ మంత్రి, సెక్రటరీ, ఐటీ మంత్రి అడ్వైజర్ కూడా సంతకాలు పెట్టాలని బక్క జడ్సన్ డిమాండ్ చేశారు.