Pomegranate: దానిమ్మ పండు సాధారణంగా అందరికీ ఇష్టం. ఇందులో విటమిన్ సి, కె, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా దీనిలో ఉండే పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం కావడానికి, కణ విభజనకు, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. సరికొత్త మెరుపును ఇస్తుంది. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడి..రక్తహీనతను నివారిస్తుంది. ఈ ఎర్రటి పండు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో బాగా పనిచేస్తుంది. పండు మాత్రమే కాదు, దాని తొక్క, విత్తనాలు, పువ్వులు కూడా పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కానీ మీకు తెలుసా? ఇన్ని ప్రయోజనాలు ఉన్న పండు కొంతమంది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఈ పండును ఎవరు తినకూడదో తెలుసుకోండి.
చర్మ అలెర్జీలు ఉన్నవారు :
సాధారణంగా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే దానిమ్మ తినొద్దు. దీనివల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మపండు తినడం వల్ల చర్మపు మచ్చలు, అలెర్జీలు వంటి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి, తినేటప్పుడు అతిగా తినకండి. అలాగే, వైద్యుల సలహా మేరకు తినండి.
తక్కువ రక్తపోటు ఉన్నవారు :
తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా దానిమ్మపండ్లు తినకూడదు. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది. అదనంగా, తక్కువ రక్తపోటుకు మందులు తీసుకునే వారికి దానిమ్మ హానికరం అని నిపుణులు అంటున్నారు.
Also Read: Papaya Leaves: ఈ ఆకుల రసం రోజుకో స్పూను తాగితే చాలు..! శరీరంలో ఊహించలేని మార్పులు చూస్తారు..
రక్తపోటు పెరగవచ్చు :
అధిక రక్తపోటు ఉన్నవారు దానిమ్మపండ్లు తింటే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నవారు దానిమ్మపండ్లు తింటే వారి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు దానిమ్మపండు తింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే,ఖాళీ కడుపుతో దానిమ్మపండు తినవద్దు. ఎందుకంటే దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదు
మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిమ్మ తినకూడదు. దానిమ్మపండును అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దానిమ్మలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచే అవకాశం ఉంది. కాబట్టి మీకు డయాబెటిస్ ఉంటే దానిమ్మ తినకండి.
అజీర్ణ సమస్యలు ఉన్నవారు :
జీర్ణక్రియ సరిగా లేని వ్యక్తులు, ఉదాహరణకు అజీర్ణంతో బాధపడేవారు దానిమ్మపండు తింటే ఉబ్బసం, అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే దానిమ్మ చల్లని స్వభావం గల పండు. అందువల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు. ముఖ్యంగా కాలేయ సమస్యలు ఉన్నవారు దానిమ్మపండ్లు తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్యాస్ సమస్యలు ఉన్నవారు దానిమ్మపండ్లు తింటే సమస్యలు పెరుగుతాయి. కాబట్టి దీన్ని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.