Madhya Pradesh

Madhya Pradesh: అక్కడ 17 నగరాల్లో మద్య నిషేధం.. ఎందుకంటే..

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన 17 నగరాల్లో మద్యాన్ని నిషేధించారు. మధ్యప్రదేశ్‌లో మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే 17 ఆధ్యాత్మిక నగరాల్లో మద్యాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు.
నరసింగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఇంకా మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరాల పవిత్రతను కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ల మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రామ, కృష్ణ ఆలయాలు ఎక్కడ ఉంటే అక్కడ మద్యాన్ని నిషేధిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి అంటూ చెప్పారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటనను బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి స్వాగతించారు. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిషేధం అమలు చేయాలని ఆమె పట్టుబట్టిన విషయం తెలిసిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Water Crisis: వామ్మో కార్లు కడిగినా.. మొక్కలకు నీళ్లు పోసినా జరిమానా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *