Dil Raju:

Dil Raju: దిల్ రాజు కు ఐటీ షాక్ . . మైత్రీ పైనా ఐటీ దాడులు

Dil Raju: ఎఫ్‌డీసీ చైర్మ‌న్‌, ప్ర‌ముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇండ్లు, కార్యాల‌యాల్లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు జ‌న‌వ‌రి 21న (మంగ‌ళ‌వారం) పెద్ద ఎత్తున సోదాల‌కు దిగారు. దిల్ రాజు, ఆయ‌న సోద‌రుడు శిరీశ్‌, ఆయ‌న కూతురు హ‌న్సితా రెడ్డి నివాసాలు స‌హా వ్యాపార భాగ‌స్వాముల నివాసాలు, కార్యాల‌యాల్లో ఈ సోదాలు కొన‌సాగుతున్నాయి. ఉద‌య‌మే 8 చోట్ల‌ 55 బృందాలుగా విడిపోయిన అధికారులు హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లుచోట్ల త‌నిఖీలు చేప‌ట్టారు.

Dil Raju: హైద‌రాబాద్ న‌గ‌రంలోని బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్‌, గ‌చ్చిబౌలి, కొండాపూర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొన‌సాగుతున్నాయి. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు నిర్మించిన దిల్ రాజు.. తాజాగా గేమ్‌చేంజ‌ర్‌, సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాల‌ను నిర్మించారు. దిల్‌రాజు కూతురు హ‌న్సితా రెడ్డి తెలుగులో విజ‌య‌వంత‌మైన బ‌ల‌గం సినిమాకు సోద‌రుడితో క‌లిసి నిర్మించారు.

ఇదిలా ఉండగా మరోవైపు మైత్రీ మేకర్స్ సంస్థ పై కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థల యజమానులు, భాగస్వాముల ఇళ్లపై జూబిలీ హిల్స్ ,  బంజారా హిల్స్ లో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నాయి .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *