EPFO

EPFO: త్వరలో ప్రావిడెంట్ ఫండ్ లో నాలుగు మార్పులు.. ఉద్యోగులకు సూపర్ బెనిఫిట్స్.. 

EPFO అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన సర్క్యులర్‌లో మార్పులు చేసింది. PF హోల్డర్లకు సహాయం చేయడానికి EPFO ​​4 ప్రధాన మార్పులను చేసింది. PF ఎకౌంట్ బదిలీని సులభతరం చేయడం .. KYCని అప్ డేట్ చేయడం  వంటి నియమాలు ఇందులో ఉన్నాయి. EPFO చేసిన ఆ నాలుగు మార్పుల గురించి తెలుసుకుందాం.. .

వ్యక్తిగత వివరాల అప్ డేట్.. 

PF హోల్డర్లు వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి EPFO ​​చాలా సులభం చేసింది. చాలా సార్లు, ఎకౌంట్ తెరిచేటప్పుడు, పుట్టిన తేదీ మొదలైన ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం లో పొరపాట్లు జరుగుతుండేవి. మళ్ళీ వీటిని సరిచేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవసరం అయ్యేది. ముఖ్యంగా దీనికోసం కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంప్లాయిస్ తమ పర్సనల్ డిటైల్స్ ను తామంత తామే నేరుగా EPFO వెబ్సైట్ నుంచి అప్ డేట్ చేసుకోవచ్చు. 

pf ఎకౌంట్ బదిలీ

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది, దీనిలో ఉద్యోగులు తమ ఉద్యోగాలు మారినప్పుడు వారి కోసం PF ఖాతాను ట్రాన్స్ ఫర్ చేసే ప్రక్రియను సులభతరం చేశారు. ఉద్యోగులు తమ ఎకౌంట్ ను  ట్రాన్స్ ఫర్ చేయడానికి వారి పాత లేదా కొత్త కంపెనీ నుంచి ధృవీకరణ అవసరం లేదు. ఏ ఉద్యోగి అయినా కంపెనీ మాటైనపుడు తనంత తానుగా క్లెయిమ్ చేయడం ద్వారా తన ఎకౌంట్ ను ట్రాన్స్ ఫర్ చేసుకోగలుగుతాడు.  అయితే దీనికోసం వారి  UAN ఆధార్‌తో అనుసంధానించి ఉండాలి. అలాగే సభ్యుల వ్యక్తిగత వివరాలన్నీ సరిపోలాల్సి ఉంటుంది. 

జాయింట్ డిక్లరేషన్.. 

EPFO ​​పోర్టల్‌లో జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియను సులభతరం చేసింది.  పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తండ్రి/తల్లి పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరులోని లోపాలను సరిచేయడానికి ఉద్యోగులు యజమాని సంతకాన్ని ఇంతవరకూ ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు.

CPPS వ్యవస్థ

EPFO దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS)ని ప్రారంభించింది.  దీని వలన 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. CPPS కింద, ఎవరైనా లబ్ధిదారుడు ఏ బ్యాంకు నుండి అయినా పెన్షన్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పెన్షన్ ప్రారంభించే సమయంలో వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: రాజకీయాల్లో వేలుపెట్టొద్దు...ఎవరి సైడ్‌ తీసుకోవద్దన్న విష్ణు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *