Break Up: ప్రేమలు.. బ్రేకప్ లు.. చాలా కామన్ వ్యవహారంగా మారిపోయిందిప్పుడు.. అయితే, కొన్ని బ్రేకప్ లు విషాదాలను తీసుకువస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇద్దరిలో ఒకరు ఆత్మహత్య చేసుకోవడమో.. లేకుంటే హత్యకు గురికావడంతో అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. ఇదిగో తమిళనాడులో కూడా ఇలాంటిదే ఒక హత్య జరిగింది. ప్రియుడికి బ్రేకప్ చెప్పి వేరే పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన యువతి.. తన పెళ్ళికి అడ్డు తగులుతాడనే భయంతో ప్రియుడికి విషం ఇచ్చి చంపేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం
Break Up: తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా రామవర్మ జైలు ప్రాంతంలో నివాసం ఉంటున్న గ్రీష్మ (22)తో షరోన్ రాజ్ ప్రేమలో పడ్డాడు. ఆమె రోజూ బస్సులో కాలేజీకి వెళ్తూ తనతో కలిసి ప్రయాణించేది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఇద్దరు ప్రేమలో మునిగి తేలారు. అయితే ఆ తరువాత అకస్మాత్తుగా గ్రీష్మా తన వివాహం మరొకరితో నిశ్చయం అయిందని.. తనతో డేటింగ్ ఆపమని షరోన్‌రాజ్‌ని కోరింది. అయితే, ఆ యువకుడు గ్రీష్మాతో బ్రేకప్ కు అంగీకరించలేదు. దీంతో గ్రీష్మ పెద్ద స్కెచ్ వేసింది.
Break Up: షరోన్ రాజ్ అక్టోబర్ 14, 2022న ఆమెను కలవడానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ ఆసమయంలో ఆమె ఆయుర్వేద కషాయమని చెప్పి ఒక డ్రింక్ ఇచ్చింది. అది తాగిన షారన్ రాజ్ అదే రోజు అస్వస్థతకు గురయ్యాడు.
ఆస్పత్రిలో చేరిన తర్వాత అవయవాలు విఫలమవడంతో అక్టోబర్ 25న మరణించాడు. యాసిడ్ లాంటి లిక్విడ్ తాగిన షరోన్ రాజ్ అవయవాలు విఫలమైనట్లు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. దీంతో మొదట అతనిది ఆత్మహత్యగా భావించారు. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నారు.
Break Up: కానీ, తన మరణానికి ముందు మృతుడు తన స్నేహితురాలు ఒకరికి గ్రీష్మ ఇంటికి వెళ్ళినపుడు ఒక డ్రింక్ ఇచ్చిందని.. అది తాగిన తరువాత తన ఆరోగ్యం పాడైందని చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని కూడా కోరాడు. కానీ, అతని మరణం తరువాత ఆ స్నేహితురాలు షరోన్ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో వారు గ్రీష్మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాని ఆధారంగా పరసాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత కేసును కేరళలోని తిరువనంతపురం క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. విచారణలో గ్రీష్మ తన ప్రియుడు షరోన్ కషాయంలో విషం పెట్టి చంపేశానని ఆమె ఒప్పుకుంది. తాను సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను కాబోయే భర్తకు చూపిస్తాడేమోనన్న భయంతోనే షారోన్‌ను హత్య చేసినట్లు గ్రీష్మా అంగీకరించింది.
Break Up: అంతేకాకుండా ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. తన తన తల్లి సింధు, మామ నిర్మల కుమారన్ నాయర్ అతనిని ఐదుసార్లు చంపేందుకు ప్రయత్నించారని కూడా వెల్లడించింది. దీంతో గ్రీష్మ, సింధు, నిర్మలా కుమారన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. తిరువనంతపురంలోని నెయ్యట్టింగర అదనపు సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.
Break Up: ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత 17వ తేదీన గ్రీష్మ, నిర్మలా కుమారన్‌లను దోషులుగా నిర్ధారించారు. ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో సింధు నిర్దోషిగా విడుదలైంది. గత 18న కోర్టుకు హాజరైన గ్రీష్మ.. ‘తల్లి, తండ్రులు ఒక్కరే కూతురు కాబట్టి.. వయసును బట్టి కనీస శిక్ష విధించాలని’ అభ్యర్థించింది.
ఆ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. ‘క్రిమినల్ గ్రీష్మ మానవ స్వభావాన్ని పట్టించుకోకుండా పైశాచిక పాత్రతో ప్రేమ పేరుతో మోసం చేసి ఈ హత్యకు పాల్పడింది. ‘ఇలా ఓ యువకుడి జీవితం చిన్నాభిన్నమైంది. కాబట్టి గరిష్టంగా మరణశిక్ష విధించాలి’’ అని డిమాండ్ చేశారు. ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించింది.