Sharwanand: నందమూరి బాలకృష్ణ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసింది. తాజాగా శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్రానికి అదే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు. ‘సామజవర గమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర దీనిని నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే నందమూరి బాలకృష్ణతో పాటు శర్వా స్నేహితుడు రామ్ చరణ్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ పోస్టర్ లో శర్వా ట్రెండీ దుస్తులలో ఎట్రాక్టివ్ గా కనిపిస్తుండగా, సాక్షి వైద్య, సంయుక్త ఇద్దరూ మెరుస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ జాయ్ ఫుల్ వైబ్‌ను కలిగిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు కథను భాను బోగవరపు అందించగా, నందు సవిరిగాన మాటలు రాశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన శర్వానంద్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ చిత్రంపైనే అతను భారీ ఆశలు పెట్టుకున్నాడు.
