Naadi Aada Janme

Naadi Aada Janme: ఆరు పదుల ‘నాదీ ఆడజన్మే

Naadi Aada Janme: నటరత్న యన్టీఆర్, నటిశిరోమణి సావిత్రి జంటగా ఏవీయమ్ సంస్థతో కలసి నటుడు యస్వీరంగారావు నిర్మించిన చిత్రం ‘నాదీ ఆడజన్మే’. తమిళంలో విజయం సాధించిన ‘నానుమ్ ఒరు పెన్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఏ.సి.త్రిలోక్ చందర్ ధర్శకత్వం వహించిన ‘నాదీ ఆడజన్మే’ చిత్రం 1965 జనవరి 7వ తేదీన విడుదలయింది. చిత్రకారుడైన హీరో అందాన్ని ఆరాధిస్తుంటాడు. అతనికి నల్లని అమ్మాయి భార్యగా వస్తుంది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆమెను అందరూ అసహ్యించుకుంటారు. చివరకు అందం కన్నా గుణం మిన్న అని భావించిన హీరో భార్యను చేరదీయడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రంలో యన్టీఆర్ తమ్మునిగా హరనాథ్, సావిత్రి చెల్లెలుగా జమున నటించారు. హీరోయిన్ల అన్న పాత్రలో అల్లు రామలింగయ్య కనిపించారు. హీరోల తండ్రిగా యస్వీఆర్ అభినయించారు. ‘నాదీ ఆడజన్మే’ చిత్రం ఘనవిజయం సాధించి, సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈ చిత్రం విడుదలైన వారానికే యన్టీఆర్, సావిత్రి జంటగానే రూపొందిన ‘పాండవవనవాసము’ విడుదలై ఆ సినిమా కూడా ఘనవిజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం! ‘నాదీ ఆడజన్మే’ చిత్రానికి ఆర్.సుదర్శనం సంగీతం సమకూర్చారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Movie News: సెప్టెంబర్ 5న సినీ సందడి.. భారీ ఢీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *