Adulterated Milk: చాలా మందికి రోజు టీ, కాఫీ లేదా పాలు లేకుండా రోజు ప్రారంభం కాదు. ఈ టీ, కాఫీ చేయడానికి పాలు తప్పనిసరి. అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో కల్తీ పాలను ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఈ కల్తీ పాల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్కెట్‌లో కొనుగోలు చేసిన పాలు కల్తీవా? లేక మంచివా అని గుర్తించడానికి కొన్ని పద్ధతులను పాటిస్తే తెలిసిపోతుంది.
స్వచ్ఛమైన పాల రంగు తెల్లగా ఉంటుంది. స్వచ్ఛమైన పాలను వేడిచేసినా లేదా చల్లని ప్రదేశంలో ఉంచినా రంగులో మార్పు ఉండదు. పాలు పసుపు రంగులోకి మారితే కల్తీ జరిగిందని అర్థం చేసుకోండి.
ఐదు నుంచి పది మిల్లీలీటర్ల పాలను తీసుకుని సమ పరిమాణంలో నీళ్లలో కలపాలి. ఈ సమయంలో పాలలో నురగ కనిపిస్తే.. పాలలో వాషింగ్ పౌడర్, డిటర్జెంట్ పౌడర్ కలిపినట్లు. లేకపోతే మంచివి అని అర్ధం.
ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం ధరలు రయ్.. రయ్.. స్థిరంగా వెండి ధరలు!
Adulterated Milk: స్వచ్ఛమైన పాలు రుచిలో తియ్యగా ఉంటాయి. ఇంటికి తెచ్చిన పాలను వేడి చేసి తాగిన తర్వాత తీపిగా అనిపిస్తే కల్తీ లేదని అర్థం. కల్తీ పాలు రుచిలో చేదుగా ఉంటాయి.
పాలలో నీరు కలిసిందో లేదో పరీక్షించడానికి ఒక చుక్క పాలను నేలపై పోయాలి. అవి స్వచ్ఛమైన పాలైతే త్వరగా భూమిలోకి ఇంకిపోదు. పాలలో నీరు కలిపితే వెంటనే ఇంకిపోతాయి.
ఐదు మిల్లీలీటర్ల పాలలో రెండు టీస్పూన్ల ఉప్పును కలపాలి. పాలు నీలం రంగులోకి మారితే అవి కల్తీ జరిగినట్లు గుర్తించాలి.