Manipur Violence

Manipur Violence: మణిపూర్ లో మళ్ళీ దాడులు.. విపక్షాల విమర్శలు

Manipur Violence: మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం రాత్రి కొందరు ముష్కరులు దాడి చేశారు. కడంగ్‌బండ్ ప్రాంతంలో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో బాంబులు విసిరారు. గ్రామస్తులు కూడా ఎదురుదాడికి దిగారు. అయితే ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. మణిపూర్‌లో ఈ తాజా సంఘటన సిఎం బీరెన్ సింగ్ క్షమాపణ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత జరిగింది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు, ప్రాణనష్టం జరిగినందుకు బీరేన్ సింగ్ మంగళవారం క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. 

దీనిపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ప్రధాని మోదీ మణిపూర్‌ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు  బీరేన్ సింగ్ స్పందిస్తూ.. మాజీ ప్రధాని నరసింహారావు హయాంలోనూ మణిపూర్‌లో అశాంతి ఉండేదన్నారు. ఆయన ఎప్పుడైనా అక్కడకే వెళ్ళారా అంటూ ఎదురుదాడి చేశారు. 

ఇది కూడా చదవండి: Union Cabinet: రైతులకు కేంద్ర క్యాబినెట్ శుభవార్త!

Manipur Violence: డిసెంబరు 31న సచివాలయంలో మీడియాతో జరిగిన చర్చలో సీఎం బీరేన్ సింగ్ మాట్లాడుతూ హింసలో చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారని చెప్పారు. చాలా మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. నన్ను జంగా క్షమించండి. నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అంటూ చెప్పారు. 

కాగా, మణిపూర్‌లో మే 2023 నుండి అక్టోబర్ 2023 వరకు 408 కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. నవంబర్ 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు 345 సంఘటనలు జరిగాయి. మే 2024 నుండి 112 సంఘటనలు నమోదయ్యాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Supreme Court: ఆమే నేరంగా చూడడం లేదు.. పోక్సో కేసు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *