Mohanlal: తెలుగు స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మించి చేయడానికి ఆలోచిస్తుంటారు. కానీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూనే ఉన్నారు. ఆయన నటించి, తొలిసారి దర్శకత్వం వహించిన ‘బరోజ్’ మూవీ ఈ నెల 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. పిల్లలను ఆకట్టుకునే అంశాలతో రూపుదిద్దుకున్న ఈసినిమాను త్రీడీలో తీశారు. తెలుగు రాష్ట్రాలలో మైత్రీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దీనిని రిలీజ్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే మోహన్ లాల్ ‘తుడరుమ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో శోభన నాయికగా నటిస్తోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ను తరుణ్ మూర్తి తెరకెక్కించారు. విశేషం ఏమంటే ఈ సినిమాలో మోహన్ లాల్ టాక్సీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘తుడరమ్’ మూవీ వచ్చే జనవరి 30న విడుదల కాబోతోంది.
