Viral News: ఎరుపు లేదా నీలం రంగులతో నిండిన ప్లాస్టిక్ బాటిళ్లను ఇళ్ల ముందు వేలాడదీయడం ఈ మధ్య చాలా చోట్ల కన్పిస్తుంది. పాములు, కుక్కలు రావు అని రాసి ఉన్న ఎరుపు-నీలం ప్లాస్టిక్ బాటిళ్లను ఇంటి గోడలకు వేలాడదీస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇలా చేస్తే కుక్కలు, పాములు నిజంగా రావా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎరుపు-నీలం ప్లాస్టిక్ సీసాలు
నీలిరంగులో నీళ్లు కలిపి ప్లాస్టిక్ బాటిళ్లను నింపి ఇంటి ముందు వేలాడదీస్తే కుక్కలు, పాములు ఇంటి దగ్గరకు రావని కొన్ని ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు. ఈ బాటిళ్లను చూసి కుక్కలు, పాములు పారిపోతున్నాయని.. దీంతో ఎటువంటి భయం ఉండదని వాళ్లు చెప్తున్నారు. పాములు, కుక్కలు ఇతర రంగుల కంటే నీలిని స్పష్టంగా చూస్తాయనేది ప్రజల నమ్మకం. కుక్కలు, పాములు ఆ రంగును చూసి ఏదో ప్రమాదం ఉందని అనుకుంటాయని.. అందుకే ఇళ్ల బయట నీలిరంగు సీసాలు వేలాడుతున్నాయని కొంత మంది చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Mahaa News: మరో మహా విజయం.. కాకినాడ పోర్టు కబ్జాపై రంగంలోకి ఈడీ!
సైన్స్ ఏం చెబుతోంది?
సైన్స్ ప్రకారం.. కుక్కలు రంగును గుర్తించలేవు. రంగుల మధ్య తేడాను అవి కనిపెట్టలేవు. నీలిరంగు బాటిల్‌ను వేలాడదీయడం వల్ల కుక్కలు ఇంటి దగ్గరికి రాకుండా నిరోధించగలవని శాస్త్రీయ ఆధారం లేదని నిపుణులు చెబుతున్నారు. అది మూఢనమ్మకం అని కొట్టిపారేస్తున్నారు.