Telangana: సాంకేతిక, ఇతర కారణాలతో నిలిచిన రుణమాఫీ సొమ్ము విడుదల కాని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందజేయనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు మూడు విడుతలుగా 2 లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ కాగా, అంతకు మించి, రేషన్‌కార్డులు లేక, ఇతర కారణాలతో వేలాది మంది రుణాలు మాఫీ కాలేదు. దీంతో అలాంటి రైతుల బ్యాంకు ఖాతాల్లో శనివారం నగదు పడే అవకాశం ఉన్నది.
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా శనివారం రైతు పండుగ ముగింపు వేడుకలో రైతు రుణమాఫీ నగదుగా నాలుగో విడుత అందించనున్నట్టు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో ని్వహించనన్న రైతు పండుగ ముగింపు సభలో సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీతోపాటు రైతుల కోసం మరిన్ని వరాలు కురిపించనున్నారని సమాచారం.
One Reply to “Telangana: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్?”