Bus Accident: మహారాష్ట్రలోని గోడిన్యాలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన శివషాహి బస్సు భండారా నుంచి గోండియాకు వస్తోంది. గోండియాకు 30 కి.మీ దూరంలో ఉన్న ఖజ్రీ గ్రామ సమీపంలో బస్సు బోల్తా పడింది.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్?
Bus Accident: బైక్ పై వెళుతున్న వ్యక్తి సడన్ గా బస్సు ముందుకు వచ్చేసాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో బస్సును పక్కకు తిప్పే ప్రయత్నం చేశాడు డ్రైవర్. అయితే, ఈ సమయంలో బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న రెయిలింగ్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఘటన అనంతరం బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.గాయపడిన వారిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, మహారాష్ట్ర తాత్కాలిక సీఎం ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌లు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు షిండే రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.