Fengal toofan: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్, నికోబార్ దీవులు, పుదుచ్చేరిలలో కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తిరుపతి జిల్లాలో ఫెంగల్ తుఫాన్ వల్ల భారీ ఎఫెక్ట్ కలుగుతుంది. రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం ఆడుతుందటంతో తిరుపతి ఎయిర్‌పోర్టులో 4 విమాన సర్వీసులు రద్దు చేశారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన..విమానాలను రద్దు ఇండిగో ఎయిర్ లైన్స్ రద్దు చేసింది.ఏర్పేడు మండలంలో సీత కాలువ పొందిపొర్లుతుందటంతో మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
ఫెంగల్ తుఫాన్‌పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి..అనుగుణంగా చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. పూర్తి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు నిర్దిష్టమైన సమాచారాన్ని చేరవేయాలన్న సీఎం సూచించారు.