IPL Mega Auction 2025: ఐపీఎల్ వేలం ముగిసింది. చాలామంది ఆటగాళ్లు ఈ వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడంతో ఖాళీ అయిపోయారు. గత సీజన్స్ లో మంచి ఆటతీరు చూపించినా కొంతమందిని ఎంపిక చేయలేదు. అలా ఎంపిక కాకుండా మిగిలిపోయిన వారి వివరాలు ఒకసారి చూద్దాం.
అల్జారీ జోసెఫ్.. గత ఐపీఎల్ లో ఆర్సీబీ 11 కోట్లకు ఇతనిని తీసుకుంది. ఇప్పుడు బేస్ ప్రామిస్ 2 కోట్లు పెట్టినప్పటికీ.. అతన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గా మంచి రికార్డ్ జోసెఫ్ కు ఉంది.
మయాంక్ అగర్వాల్: టీమిండియా స్టార్ ఓపెనర్ గా వెలిగిన ఇతన్ని కూడా ఎవరూ తీసుకోవడానికి ముందుకు రాలేదు. గతం సీజన్ లో ఎస్ఆర్ హెచ్ 8 కోట్లతో ఇతనిని తీసుకుంది. అయితే, ఇప్పుడు ఇతని కోసం ఎవరూ ముందుకు రాలేదు. గత ఐపీఎల్ లో మయాంక్ అగర్వాల్ ప్రదర్శన సరిగాలేని కారణంగా ఇతన్ని పక్కన పెట్టారు.
స్టీవ్ స్మిత్: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అయిన స్మిత్ గత ఐపీఎల్ లో పాల్గొనలేదు. ఈసారి అతను ఫామ్ లో లేడని ఎవరూ తీసుకోలేదు. ఇతని బేస్ ప్రైస్ 2 కోట్లుగా నిర్ణయించారు.
సర్పరాజ్ ఖాన్: టీమిండియా యంగ్ స్టార్ గా అద్భుత ప్రదర్శన చేస్తున్నా.. ఇతనిని కూడా ఎవరూ తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఇతని బ్రెష్ ప్రైస్ 75 లక్షలుగా ఉంది.
కెన్ విలియమ్సన్: న్యూజీలాండ్ స్టార్ బ్యాట్స్ మ్యాన్ 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలో ఉన్నాడు. కానీ, అతని ఆరోగ్యంపై సందేహాలతో ఎవరూ తీసుకోవడానికి ముందుకు రాలేదు.
ఇది కూడా చదవండి: Team India: టీమిండియాకు కొత్త జెర్సీ.. అదిరిపోయింది!
జానీ బేరిస్టో: ఇంగ్లాండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్నాడు. ఇతని బేస్ ప్రైస్ 2 కోట్లుగా నిర్ణయించారు. ఐపీఎల్ లో ఒక సెంచరీ చేసిన ఘనత కూడా ఉంది. అయినా ఇతనికి కూడా అవకాశం ఇవ్వలేదు.
డేరియల్ మిచెల్: న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్. గత ఐపీఎల్ లో సీఎస్ కె 14 కోట్లు ఈ ఆటగాడిపై వెచ్చించింది. ఈసారి బేస్ ప్రైస్ 2 కోట్లు ఉన్నప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా ఇతన్ని తీసుకోవడానికి ముందుకు రాలేదు.
పృథ్వీ షా: టీమిండియాలో ఓపెనర్. ఫామ్ లేకపోవడంతో బేస్ ప్రైస్ 75 లక్షలుగా ఉన్నప్పటికీ ఎవరూ ఇతని పై ఆసక్తి చూపించలేదు.
శార్దూల్ ఠాకూర్: టీమిండియాలో ఆల్ రౌండర్. ఇతని బేస్ ప్రైస్ 2 కోట్లు. కానీ ఈ ఐపీఎల్ వేలంలో ఖాళీగా ఉండిపోయాడు.
డేవిడ్ వార్నర్: ఆస్ట్రేలియా ప్లేయర్. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్లేయర్లలో ఒకడు. ఇతని బేస్ పైస్ 2 కోట్లు. ఈసారి ఇతని సేవలను ఏ ఫ్రాంఛైజీ కోరుకోలేదు.
One Reply to “IPL Mega Auction 2025: ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లు వీరే”