తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్మిషన్ గడువు మరోసారి పొడిగిస్తున్నటు తెలిపింది. రూ 500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సూచించింది.
ఈ అవకాశాన్ని విద్యర్థులుసద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే చేరాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఇంటర్ బోర్డు సైట్ లో ఉంచినట్లు తెలిపింది. వాటిని చెక్ చూసుకున్న తర్వాతే… అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది..
షెడ్యూల్ నిర్ణయించిన ప్రకారం… ఇంటర్ ఫస్టియర్ తరగతులు జూన్ 01 నుంచే ప్రారంభమయ్యాయి. పాఠశాల అధికారులు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, తాత్కాలిక టెన్త్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాల్స్ ఇంటర్ ప్రవేశాలను పొందవచ్చు. ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్ ను నిర్థారిస్తారు.