Manas Sarovar Yatra

Manas Sarovar Yatra: భక్తులకు శుభవార్త! మానస సరోవర్ యాత్రకు గ్రీన్ సిగ్నల్

Manas Sarovar Yatra: బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరోలో జరిగిన  జి-20 సదస్సు సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా కౌంటర్ వాంగ్ యితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించడం, భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడం వంటి అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. కైలాష్ మానస సరోవరం యాత్ర గత ఐదేళ్లుగా మూతపడింది. అటువంటి పరిస్థితిలో, ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య ఈ చర్చల తరువాత, భారతదేశ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇద్దరు నేతలు.  

ఇది కూడా చదవండి: National News: అక్ష‌రాస్య‌త‌లో దేశంలో టాప్-10 రాష్ట్రాలు ఇవే..

సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న లిపులేఖ్ పాస్ ద్వారా  కైలాష్ మానససరోవర్ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణం జూన్ నెలలో ప్రారంభమవుతుంది.  అయితే దీని కోసం ఏర్పాట్లు జనవరి నుండి ప్రారంభమవుతాయి. కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది హిందూ మతానికి చాలా ముఖ్యమైన పవిత్ర యాత్ర. ఈ ప్రయాణం టిబెట్‌లోని కైలాస పర్వతం,  మానససరోవర్ సరస్సు దర్సించుకునే అవకాశం దొరుకుతుంది. రెండూ హిందువులకు పవిత్ర స్థలాలుగా పరిగణిస్తారు.  కైలాస పర్వతం శివుని నివాసంగా చెబుతారు. అలాగే,  మానససరోవర్ సరస్సు ను బ్రహ్మ దేవుడు సృష్టించినట్లు భావిస్తారు. ఈ సరస్సు టిబెట్ ఎత్తైన పీఠభూమిలో ఉంది.  దీని ఎత్తు దాదాపు 4,590 మీటర్లు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Russian Missile Attack: ఉక్రెయిన్ మంత్రులే లక్ష్యంగా రష్యా దాడి.. ముగ్గురు మృతి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *