AP News: తొమ్మిదో తరగతి..ఈ చిన్న వయసులో ఏముంటాయి కష్టాలు. ఆదుకోవడం , చదువుకోవడం …అంతకు మించి ..వేరేవి జిరో. అలాంటిది ఆ అబ్బాయి ..చనిపోయాడు. కాదు మాకు అనుమానం ఉంది అని అబ్బాయి తరపు వారు. లేదు …ఆత్మహత్య అని ఆ స్కూల్ వాళ్ళు. మరి నిజం ఏంటి ? పోలీసులు రంగంలోకి దిగారు .
తొమ్మితో తరగతి విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది.. పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం జంక్షన్ సమీపంలోని పాఠశాలలో వెల్దుర్తి మండలం లోయపల్లికి చెందిన పందిరి రాజశేఖర్ చదువుతున్నాడు. హాస్టల్‌లో ఉండే రాజశేఖర్ గురువారం ఉదయం యథావిధిగా స్కూల్‌కు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో క్లాస్ నుండి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు హాస్టర్‌రూంకు వెళ్లి చూడగా తాడుతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉన్నాడు.
దీంతో ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వగా వారు రాజశేఖర్‌ను కిందకి దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెంది ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుమారుడు మృతి సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు.
రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్ తండ్రి సాంబయ్య వ్యవసాయం చేస్తూంటాడు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు గుంటూరులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నకుమారుడైన రాజశేఖర్ మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.