Kannappa: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన కీలక హార్డ్ డిస్క్ చోరీకి గురైందని సంచలన ఆరోపణలు చేసింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి కొరియర్‌లో పంపిన హార్డ్ డిస్క్‌లో రెండు ముఖ్య పాత్రల యాక్షన్ దృశ్యాలు, వీఎఫ్ఎక్స్ విజువల్స్ ఉన్నాయని తెలిపింది. చరిత అనే మహిళ సమాచారంతో రఘు అనే వ్యక్తి ఈ డిస్క్‌ను తీసుకుని పరారయ్యాడని, వీరిద్దరికీ తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 90 నిమిషాల ఫుటేజ్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేసేందుకు కుట్ర జరిగిందని, ఇది వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన నీచమైన చర్య అని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నప్ప టీమ్, కఠిన చర్యలకు సిద్ధమైంది.
