Gopichand Malineni: తన స్టైల్ కమర్షియల్ మూవీస్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందుండే రవితేజ.. డాన్ శీను మూవీతో గోపిని పరిచయం చేశాడు. 2010 ఆగస్టు 6న విడుదలైందీ సినిమా. ఈరోజుతో 15 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. అంటే గోపి 15 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నమాట.
డాన్ శీను, తర్వాత రవితేజ-గోపిచంద్ కాంబోలో బలుపు, క్రాక్ సినిమాలొచ్చాయి. మైత్రీ బ్యానర్ లో ఓ సినిమా ఓపెనింగ్ జరిగి ఆగిపోయింది. సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టాడు. బాడీగార్డ్, పండగచేస్కో, విన్నర్ సినిమాలు కూడా చేశాడు. వీరసింహా రెడ్డి తర్వాత బాలయ్యతో మరో ప్రాజెక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్న గోపిచంద్ మలినేని ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిలిం ఇండస్ట్రీ, హీరోల ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ నుండి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.