Zebra

Zebra: 4న పాటతో ‘జీబ్రా’ ప్రచారం షురూ!

Zebra: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో సత్యదేవ్ ఒకరు. అదృష్టం కలసి రాక ఇప్పటి వరకూ తనకు సాలీడ్ హిట్ పడలేదు. ఇప్పుడు తను నటిస్తున్న తాజా చిత్రం ‘జీబ్రా’. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీని ఎస్.ఎన్. రెడ్డి, పద్మజ నిర్మించారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థిల్లర్ ను నవంబర్22న విడుదల చేయబోతున్నారు. దీపావళికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను పోటీవద్దని వాయిదా వేశారు. ఇక ఈ సినిమా ప్రచారాన్ని పాట రిలీజ్ తో మొదలు పెట్టనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో డాలి ధనుంజయ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సత్యరాజ్, ప్రియభవానీశంకర్, సునీల్ ఇతర ప్రధాన పాత్రధారులు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో అయినా సత్యదేవ్ మంచి హిట్ కొడతాడేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chiranjeevi: చిరుతో యంగ్ హీరో వైఫ్ రొమాన్స్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *