Crime News: డబ్బు , పలుకుబడి ఉంటె చాలు..తమ కంటే తక్కువైన వాడిని మూడు చెరువుల నీళ్లు తాపించొచ్చు. అదే మనకంటే బలవంతుడి జోలికి వెళ్ళాలి అంటే …చు చు నే. అలాంటిదే ఈ మ్యాటర్ కూడా. కొందరు …ఒకరిని టార్గెట్ చేసారు. ఎంతలా టార్చర్ పెట్టాలో అంతలా పెట్టారు. ఇంకా నా వల్ల కాదు అనుకుని ..చనిపోవాలి అనుకున్నాడు. కానీ..తన మరణంతో అయినా..ఆ శాడిస్ట్ లలో మార్పు రావాలి అని సాక్షాలతో మరణ వాగ్మూలం ఇచ్చాడు.
సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డోర్నకల్ మండలంలోని తోడేళ్లగూడెంలో చోటుచేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించి అపస్మారక స్థితికి వెళ్లాడు.. స్థానికులు గమనించి సతీష్‌ను చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించగా అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మృతుడి సెల్ఫీ వీడియో కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన పగడాల సతీష్ తన చావుకు అదే గ్రామానికి చెందిన వెంకన్న,పవన్,చరణ్ కారకులని ఆరోపించాడు. తనను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
స్టేషన్ లో తన ఫిర్యాదు పట్టించుకోలేదని కారకులు దౌర్జన్యంగా తనపై కేసు నమోదు చేయించారని ఆరోపించాడు. తనకు ఇద్దరు పిల్లలు కుటుంబానికి న్యాయం చేయాలని పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు పేర్కొన్నాడు.ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది.