Chiranjeevi: అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అదితిరావు హైదరీని ఫిక్స్ చేశారట. ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, మహాసముద్రం లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తమిళ్‌లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఇక హీరో సిద్దార్థ్‌ను ఈ భామ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత అదితిరావు సినిమాలు అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఏకంగా మెగస్టార్ చిరంజీవి మూవీలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. అలాగే దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ప్రజెంట్ మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.
