Women Junior Asia Cup

Women Junior Asia Cup: దీపిక హ్యాట్రిక్..భారత జూనియర్ జట్టు ఘన విజయం..

Women Junior Asia Cup: మస్కట్ లో జరుగుతున్న జూనియర్‌ మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్ దూసుకుపోతున్నది. మలేసియా జట్టుతో జరిగిన గ్రూప్‌ఎరెండో లీగ్‌ మ్యాచ్‌లో దీపిక హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో 5–0 గోల్స్‌ తేడాతో టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది.

జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత అమ్మాయిల జట్టు అదరగొడుతోంది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్..వరుసగా రెండో విజయంతో టోర్నీలో అద్భుతంగా పురోగమిస్తోంది. మలేసియా అమ్మాయిలతో జరిగిన రెండో మ్యాచ్ లో 5–0 గోల్స్ తో జ్యోతి సింగ్‌ నేతృత్వంలోని భారత జట్టు సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్‌ తరఫునప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ స్టార్ స్టైకర్ దీపిక హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించింది. ఈ మ్యాచ్ లో దీపిక 37వ, 39వ, 48వ నిముషాల్లో గోల్స్ కొట్టడంతో భారత్ కు తిరుగులేకుండా పోయింది.

ఇది కూడా చదవండి:WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో..రెండు బెర్తుల కోసం మూడు టీమ్స్ పోరాటం..

Women Junior Asia Cup: అంతేకాదు భారత్ తరఫున32వ నిమిషంలో వైష్ణవి ఫాల్కే, 38వ నిమిషంలో కనిక సివాచ్‌ ఒక్కో గోల్‌ అందించారు. మ్యాచ్‌ మొత్తంలో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు… రెండు పెనాలీ స్ట్రోక్‌లు లభించాయి. ఇందులో మూడు పెనాల్టీ కార్నర్‌లను, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను భారత జట్టు గోల్స్‌గా మలిచింది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 7–2 గోల్స్‌ తేడాతో చైనీస్‌ తైపీ జట్టును ఓడించింది. ఐదు జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన భారత్, చైనా జట్ల ఖాతాలో ఆరు పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే చైనా గోల్స్ సగటుతో టాప్‌ ర్యాంక్‌లో, భారత్‌ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి. బుధవారం జరిగే మూడో లీగ్‌ మ్యాచ్‌లో చైనాతో భారత్‌ తలపడనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *