WTC Final

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో..రెండు బెర్తుల కోసం మూడు టీమ్స్ పోరాటం..

WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. మూడు జట్లలో ఏ రెండు రెండు జట్లు ఫైనల్ చేరడం ఖామయే. దీంతో ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ విజేతగా నిలవడంతో సౌతాఫ్రికా టేబుల్ టాపర్ గా నిలవగా..గులాబి టెస్టులో పరాజయంతో భారత్ మూడో ప్లేసులో కొనసాగుతోంది. 

ప్రపంచ టెస్టు ఫైనల్ రేసు మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఒకవైపు వరుస విజయాలతో సౌతాఫ్రికా 63.33 విజయాల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న సౌతాఫ్రికా మరొక మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంటుంది. ఈ నెల చివరలో సౌతాఫ్రికా, పాకిస్థాన్‌ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో ఒక్క టెస్టు మ్యాచ్ గెలిచినా ఫైనల్ బెర్త్ ఖాయమౌతుంది.

ఇది కూడా చదవండి: Nitish Kumar Reddy: భళా నితీశ్ రెడ్డి.. తెలుగు కుర్రాడి ప్రదర్శనపై ప్రశంసల వర్షం

సఫారీ టీమ్ టాప్‌లోకి రావడంతో 60.71 విజయాల శాతంతో ఆసీస్ జట్టు రెండో స్థానానికి, 57.29 విజయాల శాతంతో టీమిడియా మూడో ప్లేస్‌కు పడిపోయింది. సౌతాఫ్రికా రెండు టెస్టుల్లో ఓడించడంతో భారత్‌కు కలిసొస్తుంది. ఎందుకుంటే ఫైనల్‌ రేసులో శ్రీలంక వెనకబడింది. ఇప్పుడు ప్రధాన పోటీలో ఉన్న ఆసీస్, సౌతాఫ్రికా, భారత్ ఈ మూడు జట్ల మధ్యే ఉంది.

WTC Final: మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌ చేరాలన్న టీమిండియా కల నెరవేరాలంటే.. ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా ఫైనల్‌ చేరుతుంది. ఒక్కటి ఓడినా ఫైనల్ బెర్తు అవకాశాలు క్లిష్టంగా మారుతాయి. అప్పుడు సౌతాఫ్రికా, పాకిస్థాన్‌ సిరీస్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆసీస్‌తో సిరీస్‌ను భారత్‌ 3-2తో గెలిచినా 64.05 శాతంతో ఫైనల్‌కు దూసుకెళుతుంది. అప్పుడు ఆసీస్‌.. శ్రీలంకతో మిగిలిన రెండు టెస్టుల్లో గెలిచినా భారత్‌ను అధిగమించదు. ఆసీస్‌తో సిరీస్‌ 2-2తో డ్రా అయితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలకు గండి పడుతుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2-2తో డ్రా అయి శ్రీలంకపై ఆసీస్‌ 2-0తో గెలిస్తే టీమ్‌ఇండియా రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-2 లేదా 3-1తో గెలిస్తేనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైనల్‌కు చేరుతుంది. ఒక మ్యాచ్‌ డ్రా అయినా కూడా అవకాశాలుంటాయి. కానీ, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోతే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలు చేజారుతాయి.

ALSO READ  Raw Netflix: నెట్‌ఫ్లిక్స్ లో WWE Raw తొలి ఎపిసోడ్.. ఎంత మంది చూశారు అంటే

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *