Crime News: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అక్రమ సంబంధం రక్తపాతం సృష్టించింది. ప్రియుడి కోసం భార్య తన భర్తను హత్య చేయించుకున్న ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహపురంలో చోటుచేసుకుని కలకలం రేపుతోంది.
ప్రేమ పెళ్లి.. 15 ఏళ్ల దాంపత్య జీవితం
వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణ్, పావని పెద్దలను ఎదిరించి 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ వెంకట నరసింహపురంలో అద్దెకు ఉంటూ జీవనం కొనసాగిస్తూ, ఇద్దరు కుమార్తెలకు తల్లిదండ్రులుగా మంచి కుటుంబ జీవితం గడుపుతున్నారు.
పరిచయం.. అక్రమ సంబంధంగా మారింది
ఇంతలో పావనితో సన్నిహిత బంధువు ప్రదీప్ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాలక్రమేణా అక్రమ సంబంధంగా మారింది. భర్త లక్ష్మణ్‌కి అనుమానం రావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Shortest War: ప్రపంచంలోనే అతి చిన్న యుద్ధం.. నిమిషాల్లోనే ముగిసింది..
హత్య.. అంత్యక్రియలు.. ఆరా తీయగా బయటపడిన నిజం
ఆగస్టు 13న లక్ష్మణ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఏమి తెలియనట్లుగా పావని చింతకుంటలో అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆమె ప్రవర్తనపై లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు అనుమానం కలగడంతో నిజం వెలుగులోకి వచ్చింది. పావని – ప్రదీప్ మధ్య ఉన్న అక్రమ సంబంధం బట్టబయలైంది.
ఒప్పుకున్న భార్య.. అదుపులోకి ప్రియుడు
లక్ష్మణ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో పావని భర్త హత్య విషయాన్ని ఒప్పుకుంది. ప్రదీప్‌తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు.