Team India

Team India: టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరో..?

Team India: టీమిండియా ఫ్యూచర్ టెస్టు కెప్టెన్ విషయమై క్రికెట్ ప్రపంచంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మ 37 ఏండ్లకు చేరుకోవడం.. ఫిట్ నెస్ సమస్యలు… అతనిక మరిన్నాళ్లు టెస్టుల్లో టీమ్ ను లీడ్ చేసే పరిస్థితి లేదన్న విషయం తేటతెల్లం చేస్తోంది. అంతేకాదు ఇటీవలి కాలంలో టెస్టుల్లో పూర్ బ్యాటింగ్ తో నిరాశ పరుస్తున్నాడు. కివీస్ తో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో ఆసీస్ తో జరిగే బిజిటి సిరీస్ అనంతరం టెస్టుల నుంచి రోహిత్ శర్మ తప్పుకుంటాడనే ప్రచారం ఊపందుకుంది. అంతే కాదు ఈ ఏడాది టెస్టుల్లో కేవలం 29 సగటుతో 588 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ కెరీర్…అతనిక చాలించాల్సిందే అన్న సంకేతాలు పంపుతోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ వారసులుగా ముగ్గురు టీమిండియా ప్లేయర్లు టెస్టు కెప్టెన్ లుగా అయ్యే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. టెస్టు జ‌ట్టుకు కెప్టెన్ గా  రిష‌బ్ పంత్ బెస్ట్ ఛాయిస్ అవుతాడ‌నే విశ్లేష‌ణ ఉంది. దీన్ని హైలెట్ చేస్తోంది ఎవ‌రో కాదు.. విఖ్యాత క్రికెట‌ర్, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. 24 యేళ్ల పంత్ ను టెస్టు జ‌ట్టుకు కెప్టెన్ గా చేయాల‌ని , అది మంచి ఎంపిక అవుతుంద‌న్న అభిప్రాయం వ్యక్తమౌతున్న నేపథ్యంలో గవాస్కర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక మరో ఇద్దరిలో ఒకరు యంగ్ శుభ్ మన్ గిల్ కాగా… మరొకరు జస్పీత్ బుమ్రా. వీరి ముగ్గురిలో ఒకరు టెస్టు జట్టు పగ్గాలు అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. 

Team India: భవిష్యత్ టెస్టు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ టీమిండియాకు బెస్ట్ చాయిస్ అవుతాడు.  ప్రపంచంలోనే అత్యంత బలమైన బౌలింగ్ ధాటిని ఎదుర్కొని చిన్నవయసులోనే టెస్టు క్రికెట్ లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు గిల్. అతను అరంగేట్రం చేసిన సమయం నుంచి టెస్టుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు.  25 ఏండ్ల గిల్ టీమిండియాలో కొత్త తరానికి ప్రతినిధి కావడం.. కెప్టెన్ గా చాలా ఏండ్ల పాటు సేవలు అందించగల సామర్థ్యం అతని సొంతం. అంతేకాదు ఇటీవలి కాలంలో  టీ20, వన్డేలకు డిప్యూటీ కెప్టెన్ గా నియమించడం అతన్ని భవిష్యత్ కెప్టెన్ చేయాలన్న ఉద్దేశమే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Team India: ప్రస్తుత టీమిండియాలో  టెస్టుల్లో బెస్ట్ బ్యాటర్ ఎవరంటే అందరూ ఒకే పేరు చెబుతారు. అది రిషబ్ పంత్. 2018లో టెస్టు క్రికెట్ లో అరంగేట్రం నుంచి అద్భుత బ్యాటింగ్ తో టెస్టుల్లో నమ్మదగిన నిలకడైన బ్యాటర్ గా దుమ్ము రేపుతున్నాడు.  డెబ్యూ నుంచి టెస్టుల్లో  టాప్ టెన్ స్కోర్లు సాధించిన జాబితాలో టాప్ 4 లో  రిషబ్ ఉండడం విశేషం. టెస్టుల్లో 44 సగటుతో కీలక సమయంలో క్రీజులో నిలిచి అద్భుత విజయాలు అందించాడు 27 ఏండ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.  అంతేకాదు కెప్టెన్ గానూ ఐపీఎల్ లో అతనికి మెరుగైన రికార్డు, అనుభవం ఉంది. ఢిల్లీ టీమ్ కెప్టెన్ గా అతను మంచి ప్రతిభ కనబరిచాడు. వికెట్ కీపర్ గా మైదానంలో ఫీల్డ్ ప్లేస్ మెంట్ పై  కెప్టెన్, బౌలర్లతో సంప్రతింపులు చేస్తుండడం అతను టీమిండియా కెప్టెన్ అయ్యేందుకు దోహదం చేస్తుంది. ఇప్పటికే బ్యాటింగ్ లో సత్తా చాటుతున్న పంత్.. కెప్టెన్ గానూ తన దూకుడైన శైలితో మరింతగా రాణించి మ్యాచ్ విన్నర్ గా తన పాత్రను మరింత సమర్థవంతంగా పోషించే అవకాశం ఉంది. ఇదే జ‌రిగితే గతంలో దక్షిణాఫ్రికా జ‌ట్టు పూర్తి స్థాయి కెప్టెన్సీ ప‌గ్గాల‌ను గ్రేమ్ స్మిత్ కు అప్పగించిన చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం ఉంది. 2003 ప్రపంచ కప్ లో  ఫెయిల్యూర్ తో పొలాక్ త‌ప్పుకోగా, జ‌ట్టులో గిబ్స్, డిపనార్ వంటి సీనియ‌ర్లున్నా… యంగ్ స్మిత్ కు కెప్టెన్సీని ఇచ్చారు. చిన్న వ‌య‌సులోనే కెప్టెన్ అయిన స్మిత్ ఆ త‌ర్వాత త‌న కెరీర్ ఆసాంతం సౌతాఫ్రికా జ‌ట్టుకు కెప్టెన్ గా కొన‌సాగుతూ సఫారీల ఆటతీరును మార్చాడు.  అన్ని జ‌ట్ల ప‌రంగా చూసుకున్నా.. విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా నిలిచాడు. స్మిత్ విష‌యంలో సౌతాఫ్రికా బోర్డు చేసిన సాహ‌సం మంచి ఫ‌లితాల‌ను ఇచ్చింది. మ‌రి బీసీసీఐ అంత‌టి డేరింగ్ డెషిష‌న్ ను తీసుకుని  పంత్ ను కెప్టెన్ గా చేస్తే టీమిండియా మళ్లీ టెస్టుల్లో తన ఆధిపత్యాన్ని చాటే అవకాశం ఉంది. 

ALSO READ  Cricket: ఇక సమరం మొదలు.. టాస్ గెలిచిన న్యూజిలాండ్

Team India: టెస్టు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్న మరో పేరు పేసర్ జస్పీత్ బుమ్రా. ఇప్పటికే టెస్టుల్లో వైస్ కెప్టెన్ గావ్యవహరిస్తున్నాడు. ఒకవేళ బిజిటి సిరీస్ తొలి రెండు మ్యాచ్ లకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే బుమ్రానే జట్టు సారథిగా నడిపిస్తాడు. అంతేకాదు గతంలో ఇంగ్లండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో 2022లో జరిగిన 5వ టెస్టు మ్యాచ్ లో జట్టు సారథిగా వ్యవహరించాడు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కీ ప్లేయర్ మన బుమ్రా. అంతేకాదు సారథిగానూ అతను సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బుమ్రా టెస్టు కెప్టెన్ గా వంపికైతే కపిల్ దేవ్ అనంతరం టీమిండియా సారథిగా ఎంపికైన పేసర్ గా బుమ్రా రికార్డులకు ఎక్కడం ఖాయం. దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండకపోతే ఆసీస్ సిరీస్ వరకు పూర్తిస్థాయి కెప్టెన్ గా బుమ్రాను నియమించాలని, రోహిత్ సాధారణ ప్లేయర్ గానే ఆడాలని సూచిస్తున్నాడు. చూద్దాం ఈ ముగ్గురిలో ఎవరిని టీమిండియా కెప్టెన్సీ వరిస్తుందో.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *