War 2 Vs Coolie: ఈ ఆగస్ట్ 14న బాక్సాఫీస్ వేదికగా రెండు భారీ చిత్రాలు సమరం బిగించనున్నాయి. ఒకవైపు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల వార్ 2, మరోవైపు రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్‌తో కూలీ. సౌత్‌లో థియేటర్ల కోసం గట్టి పోటీ నడుస్తున్నా, నార్త్‌లో కూలీ ఊహించని రీతిలో ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తోంది. ఓటిటి డీల్ ఎనిమిది వారాల తర్వాత లాక్ కావడంతో నేషనల్ చైన్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూలీకి మొగ్గు చూపుతున్నాయి.
Also Read: AA22: కుర్రాడితో అల్లు అర్జున్ – అట్లీ మాస్ మ్యాజిక్ స్టార్ట్!
అమీర్ ఖాన్ పాత్ర హిట్ అయితే, హిందీ మార్కెట్‌లో కూలీ భారీ స్పందన పొందే అవకాశం ఉంది. వార్ 2 స్పై యూనివర్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఆకట్టుకుంటుంది కానీ, కూలీ రజనీ మ్యాజిక్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ బాక్సాఫీస్‌ను కుదిపేసేలా ఉంది.

