Health Tips: పాలు, ఖర్జూరం రెండూ మంచి పోషకాలతో నిండి ఉంటాయి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే రెండింటినీ కలిపి తీసుకుంటారు. అయితే ఖర్జూరాలను పాలతో కలిపి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో పాలతో ఖర్జూరం చాలా మంచిది. ఎలాగో తెలుసుకుందాం.
పాలు మరియు ఖర్జూరంలో పోషకాలు:
పాలలో ప్రోటీన్లు, విటమిన్ బి12, కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు బోన్ సమస్యలు తగ్గుతాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఖర్జూరంలో మన శరీరానికి మేలు చేసే వివిధ పోషకాలు ఉంటాయి. ఇది అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్లు, సహజ చక్కెరను కలిగి ఉంటుంది. ఇవి మన శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఖర్జూరంలోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని అనేక వ్యాధుల బారిన పడకుండా ఉంచుతాయి.
ఖర్జూరాన్ని పాలతో కలిపి తింటే ఆరోగ్య ప్రయోజనాలు:
Health Tips: బలమైన ఎముకలు:
పాలలో కాల్షియం, ఖర్జూరంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని కలిపి తీసుకుంటే అవి మన ఎముకలను దృఢంగా ఉంచుతాయి, ఎముక సమస్యలను నివారిస్తాయి. ఈ కలయిక పిల్లలు, యువకులు, వృద్ధులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ:
ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుండి త్వరగా రిలీఫ్ ను ఇస్తుంది.
Health Tips: శక్తి స్థాయిలను పెంచుతుంది:
ఖర్జూరంలో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే తక్షణ శక్తి వస్తుంది. ఇది అలసట, బలహీనత వంటి సమస్యల నుండి రిలీఫ్ ను ఇస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది:
ఖర్జూరం, పాలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
Health Tips: రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పాలు, ఖర్జూరాల కలయిక అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఎందుకంటే పాలు, ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో సహకరిస్తాయి.
బరువు పెరగడానికి:
పాలు, ఖర్జూరాలు బరువు పెరగాలనుకునేవారికి సహాయపడతాయి. రెండింటిలో పోషకాలు, కేలరీలు అధికంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు పాలల్లో ఖర్జూరం తింటే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Health Tips: పాలలో ఖర్జూరాన్ని ఎప్పుడు తీసుకోవాలి..?:
పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే పడుకునే ముందు తాగితే మంచిది. ఎందుకంటే ఇది రాత్రిపూట బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అయితే ఇది అందరికీ ఆరోగ్యకరం కాదు. కొందరికి అలర్జీ రావచ్చు. కాబట్టి మీకు ఏదైనా అలెర్జీ ఉంటే వీటిని తీసుకునే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.