Pear or Banana: రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ రోజూ తినే పండ్లలో అరటిపండ్లు, బేరి(పియర్) కామన్‌గా ఉంటాయి. ఈ రెండు పండ్లు పోషకాలతో సమృద్ధిగా ఉండి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కానీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనదనే విషయంలో మీరు కన్ఫ్యూజ్ అయివుండొచ్చు. దాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పియర్ పండు ప్రయోజనాలు :
బేరి పండ్లలో విటమిన్ సి, ఫైబర్, విటమిన్లు ఎ, బి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీని రెగ్యులర్ వినియోగం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ పండు ఆమ్లతను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. శరీరాన్ని వైరస్ల నుండి రక్షించి..జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందువల్ల బరువును నియంత్రించుకోవాలనుకునే వారికి ఈ పండు ఉత్తమ ఎంపిక. ఇందులో ఫైబర్ అధికంగా ఉండి..కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. అదనంగా సూర్యుని అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే సమస్యల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో, ఋతు నొప్పి తీవ్రతను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Also Read: Thandel: తండేల్ ఖాతాలో సెన్సేషనల్ రికార్డ్!
అరటిపండ్ల ఆరోగ్య ప్రయోజనాలు :
చాలా మంది రోజుకు కనీసం ఒక అరటిపండు తినాలి. ఇందులో పొటాషియం, ఐరన్, కాల్షియం, నియాసిన్, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్ మరియు విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని రెగ్యులర్ వినియోగం ఆకలిని తగ్గిస్తుంది. ఇది శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఏది మంచిది..?
ఈ రెండు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ తక్కువ కేలరీలు కలిగి, బరువు నియంత్రణకు సహాయపడే పండు కోసం చూస్తున్నట్లయితే బేరి మంచి ఎంపిక. కానీ అరటిపండు శరీర శక్తికి మంచి ఎంపిక. వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఈ పండును తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.