Peddagattu: తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టుపై ఈ రోజు (ఫిబ్రవరి 16) రాత్రి మొదలుకొని ఈ నెల 20వ తేదీ వరకు పెద్ద ఎత్తున జాతర కొనసాగుతుంది. తొలిరోజు రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని కేశారం గ్రామం నుంచి సంప్రదాయ రీతిలో దేవరపెట్టెను ఊరేగింపుగా దురాజ్‌పల్లిలోని పెద్ద గట్టకు వద్దకు తీసుకొస్తారు. లింగమంతుల స్వామి-చౌడమ్మ దేవతలతో పాటు ఇతర విగ్రహాలను కలిగి ఉన్న ఈ దేవరపెట్టె పెద్దగట్టు జాతర అంకంలోనే కీలకమైంది.
Peddagattu: రెండేండ్లకోసారి జరిగే పెద్దగట్టు జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పెద్దగట్టు జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లను మంజూరు చేసింది. అన్నిశాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది. భక్తులకు కావాల్సిన సదుపాయాలను ఇప్పటికే సమకూర్చారు.
Peddagattu: పెద్దగట్టు జారనే గొల్లగట్టు అని, లింగమంతుల జాతర అని, దురాజ్‌పల్లి జాతర అని కూడా ఇక్కడి ప్రజలు పిలుచుకుంటారు. ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లను మంజూరు చేసింది. అన్నిశాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది. భక్తులకు కావాల్సిన సదుపాయాలను ఇప్పటికే సమకూర్చారు.
Peddagattu: పెద్దగట్టు జాతరలో బందోబస్తు కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ సిబ్బందితోపాటు నల్లగొండ, వికారాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లా సిబ్బంది విధులు నిర్వహిస్తారు.
Peddagattu: ఇప్పటికే ఇద్దరు ఏఎస్సీలు, 10 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 148 మంది ఎస్ఐలు, 400 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది మహిళా సిబ్బంది, సుమారు 2000 మంది వరకు పోలీస్ సిబ్బంది ఈ విధుల్లో పాల్గొంటున్నారు. ఇంకా షీటీమ్ బృందాలు, మఫ్టి సిబ్బంది, సీసీఎస్, టెక్నికల్ టీం, డాగ్ స్క్వాడ్, రోప్ బృందాలు, పోలీస్ కళా బృందాలు, వలంటీర్లు, సెక్యూరిటీ సర్వేలైన్, కమ్యూనికేషన్ సిబ్బంది ఈ విధుల్లో పాల్గొంటారు.