Goat vs Lamb Meat: చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కొంత మందికి మేక మాంసం ఇష్టం. మేక – గొర్రె మాంసం రెండూ ఒకేలా కనిపిస్తాయి. కానీ ఈ రెండింటి మధ్య ఒక తేడా ఉంది. మేక – గొర్రె మాంసం మధ్య తేడా ఏమిటి? వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మేక మాంసం:
మేక మాంసంలో కొవ్వు తక్కువగా ఉండి..ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇందులో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. మేక మాంసంలో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మేక మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది.
మేక మాంసంతో పోలిస్తే గొర్రె మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, గుండెపోటు వచ్చినవారు లేదా స్టెంట్ వేసినవారు మటన్‌కు దూరంగా ఉండటం మంచిది. ప్రోటీన్ విషయానికి వస్తే, ఈ రెండింటిలోనూ సమాన మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. మేక మాంసంతో పోలిస్తే, గొర్రెలో ఐరన్ శాతం తక్కువగా ఉంటుంది. గొర్రె చాలా మృదువుగా ఉండి.. త్వరగా ఉడుకుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి గొర్రె మాంసం ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.
Also Read: Rice: మూడు పూటలు అన్నం తింటే ఇప్పుడే మానేయండి!
రెండింటిలో ఏది మంచిది?
ఆరోగ్యపరంగా గొర్రె మాంసం కంటే మేక మాంసం మంచి ఎంపిక. మేక మాంసంలో కొవ్వు తక్కువగా ఉండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది రుచి దృష్ట్యా గొర్రె మాంసం ఉత్తమ ఎంపిక అని అంటారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించుకోవాల్సిన వారు గొర్రె మాంసం తినకుండా ఉండటం మంచిది.