Donald Trump

Donald Trump: ట్రంప్ గెలుపుతో భారత్ కు వచ్చే నష్టమేమీ లేదు

Donald Trump: అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గత 5 గురు అధ్యక్షుల కాలంలో భారత్-యూఎస్ సంబంధాలలో స్థిరమైన పురోగతిని సాధించిందని చెప్పారు. ఎన్నికల తర్వాత అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ధీమా వ్యక్తం చేశారు. 

అమెరికన్లు ఓటింగ్‌లో ఉండగానే కాన్‌బెర్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. అమెరికాతో భారత్ సంబంధాలు భవిష్యత్తులోనూ పెరుగుతాయని అన్నారు. కాన్‌బెర్రాలో తన ఆస్ట్రేలియన్ కౌంటర్ పెన్నీ వాంగ్‌తో సంయుక్త విలేకరుల సమావేశంలో మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, యుఎస్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన క్వాడ్ భవిష్యత్తు గురించి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: America: అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన ఇండో అమెరికన్లు

రిపబ్లికన్ నాయకుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలుపొందడం గురించి ఆందోళన చెందుతున్నారా? అలాగే  అతని అధ్యక్ష పదవి క్వాడ్‌పై ప్రభావం చూపుతుందా అని మీడియా మంత్రులను ప్రశ్నంచింది. 

దీనిపై మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, “గత డోనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీతో సహా గత ఐదు అధ్యక్ష పదవీకాలంలో అమెరికాతో మా సంబంధాలలో స్థిరమైన పురోగతిని చూశాము. కాబట్టి, అమెరికన్ ఎన్నికల విషయంలో, తీర్పు ఎలా ఉన్నా, భారత్-యూఎస్ సంబంధాలపై గట్టి నమ్మకం ఉంది. అమెరికాతో మన దేశ సంబంధాలు పెరుగుతాయి’’ అని అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cold Weather: చలితో వణికిపోతున్న ఉత్తరాది.. దక్షిణాదికి వర్ష సూచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *