West Godavari District

West Godavari District: ఎలక్ట్రానిక్ పరికరాలను ఆర్డర్ చేస్తే.. డెడ్ బాడీ ని డెలివరీ చేశారు

West Godavari District: ఎలక్ట్రానిక్ పరికరాలకు బదులు పార్శిల్‌లో ఓ వ్యక్తి మృతదేహం రావడంతో ఆందోళన చెందిన మహిళ పోలీసులకు సమాచారం అందించిన.  సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు అక్కడికి చేరుకొని. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి… వివరాలు సేకరిస్తున్నారు.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో జరిగింది. 

ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో వస్తువులను ఆర్డర్ చేసినపు కొన్ని సార్లు మనం ఆర్డర్ చేసిన వస్తులకి బదులుగా వేరే వస్తులు రావడం సహజం. కానీ ఒక్క మహిళా ఆన్లైన్ వెబ్ సైట్ లో ఎలక్ట్రానిక్ వస్తువులని ఆర్డర్ చేయగా పార్సెల్ లో డెడ్ బాడీ డెలివరీ చేశారు. దింతో వెంటనే పోలీస్ లకి సమాచారం అందిచారు. దీనిపైనా పోలీస్ లు విచారణ జరుపుతున్నారు. 

ఇది కూడా చదవండి: Hyderabad: నగర వాసులకు అలర్ట్.. రేపు ఏరియాలో వాటర్ సప్లై బంద్

అసలు ఏం జరిగింది అంటే..?

నాగ తులసి అనే మహిళ గతంలో ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని ఆర్థిక సహాయం కోరింది. దింతో వాళ్ళు లైట్లు, ఫ్యాన్లతో పాటు విద్యుత్ ఉపకరణాలు అందజేస్తామని వాట్సాప్ ద్వారా ఆమెకు సమాచారం అందించారు. 

గురువారం రాత్రి, ఒక వ్యక్తి డెలివరీ బాక్స్ ని ఆమె ఇంటివద్ద పెట్టి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత తులసి పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో  దాదాపు 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహం  కనిపించింది దాంతో పాటు బెదిరింపు లేఖ ఆ బాక్స్ లో ఉంది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం 4-5 రోజుల క్రితం ఆ వ్వక్తి మరణించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడు, పార్శిల్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మీ విచారణను పర్యవేక్షించేందుకు గ్రామాన్ని సందర్శించారు.

విచారణలో పోలీసులు పార్శిల్‌లో రూ.1.30 కోట్లు చెల్లించాలని రాసిన లేఖను గుర్తించారు. అలాగే డబ్బులు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని కుటుంబాన్ని బెదిరించారు. పార్శిల్ డెలివరీ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.మరోవైపు క్షత్రియ సేవా సమితి ప్రతినిధులకు కూడా సమన్లు ​​పంపించారు.

ALSO READ  Chiranjeevi: ఆంజనేయస్వామి ఆశీస్సులతో..చిరంజీవి భావోద్వేగ పోస్ట్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *