Wedding Dates: ఈ ఏడాది 2025 మాఘ మాసంలో పెళ్లి ఘడియలు తక్కువగా ఉండటంతో ఆ సమయంలో కుదిరిన ఎన్నో జంటలు, మాటముచ్చల జరిగి పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న జంటలు సుమూహార్తాల కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తున్నాయి. అలాంటి వారి కోరిక వచ్చే నెలలో తీరనున్నది. ఎన్నో విశేష శుభ ముహూర్తాలు కలిగిన అరుదైన నెలగా ఏప్రిల్ నెల నిలువనున్నదని వేద పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకొని పెళ్లి ఘడియలు నిర్ణయించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
Wedding Dates: హోలీ వేడుకల సందర్భంగా కొన్నిరోజుల వరకు మహూర్తాలు ఉండవు. ముఖ్యంగా వివాహాలకు ఈ సమయం శుభమైనది కాదు. ఎందుకంటే ఈ కాలంలో మూఢం ఉన్నది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ మూఢం అయిపోయే నాటికి ఏప్రిల్ నెల ఆరంభం అవుతుంది. ఈ నెలలో వచ్చినన్ని ముహూర్తాలు గతంలో ఎప్పుడూ వచ్చి ఉండవని చెప్తున్నారు. ఈ నెల మొత్తం 9 వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇంత ఎక్కువగా శుభ ముహూర్తాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
Wedding Dates: సాధారణంగా పెళ్లి ముహూర్తం కుదరాలంటే ఎన్నో అంశాలను ఇరు కుటుంబాలు సరిచూసుకుంటాయి. వధూవరుల జాతకాలు, గ్రహస్థితులు, గోచారాలు, తారాబలం, గణన, రాశిఫలాలు ఇలా అన్ని అంశాలు కలిస్తేనే ఒక సుమూహర్తం కుదురుతుంది. ఈ నేపథ్యంలో ఎదురుచూసే జంటలకు ఈ ఏప్రిల్ నెల ఖచ్చితంగా మంచి ముహూర్తాలను కుదురుస్తుంది. ఇన్ని ముహూర్తాల్లో ఏదో ఒకటి సెట్ అవుతుందని పండితులు భరోసా ఇస్తున్నారు.
Wedding Dates: ఏప్రిల్ నెలలో సూర్యుడు కుంభరాశి నుంచి మీనరాశిలోని ప్రవేశిస్తున్నాడు. ఈ నెల 13వ తేదీ వరకు మూఢం ఉన్నది. దీంతో ఈ నెల 13 వరకు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. అంటే ఈ నెలలో సగభాగం సుముహూర్తాలు లేవన్నమాట. నెల సగమైన తర్వాత నుంచి పెళ్లి గడియలు మొదలవుతాయన్నమాట. అంటే కేవలం 16 రోజుల్లో 9 మహూర్తాలు ఉన్నాయన్నమాట.
Wedding Dates: మార్చి 30న ఉగాది పర్వదినం ఉన్నది. ఆ రోజు నుంచి కొత్త తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం చైత్ర మాసం, బహుళ పక్షం పాడ్యమి తిథి నుంచి సుమూహర్తాలు మొదలవుతాయి. ఏప్రిల్ 14న (పాడ్యమి), 16న (తదియ), 18న (పంచమి), 19న (షష్టి), 20న (సప్తమి, అష్టమి), 21న (అష్టమి, నవమి), 25న (ద్వాదశి), 29న (శుక్ల విదియ), ఏప్రిల్ 30న (శుక్ల తదిత) పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఇక వెళ్లండి పెళ్లి ముహూర్తం కోసం ఎదురుచూసే వారు.. మీ జాతక రీత్యా ఏ రోజున పెళ్లి సుమూహర్తం కుదురుతుందో వెంటనే వేద పండితులను కలిసి ఓ అంచనాకు వచ్చేయండి.