Keerthy Suresh: ‘మహానటి’తో జాతీయ అవార్డును అందుకున్న కీర్తి సురేశ్ ఈ యేడాది డిసెంబర్ లో పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. కీర్తి సురేశ్ సరసన నటించిన హీరోలతోనూ, అలానే ఓ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో ఆమె ప్రేమాయణంలో ఉందనే వార్తలు కొంతకాలంగా మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వేటినీ ఖండించే పనిని కీర్తి సురేశ్ పెట్టుకోలేదు. తన మానాన తాను సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. కీర్తి సురేశ్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా ఆమెను వెతుక్కుంటూ కొత్త అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా’ మూవీలో నటిస్తున్న కీర్తి.. ఈ యేడాది ‘బేబీ జాన్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కాబోతుండగా.. దానికి కొద్ది రోజుల ముందే కీర్తి పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. కీర్తి సురేశ్ తన బాల్య స్నేహితుడు, దుబాయ్ బిజినెస్ మ్యాన్ ఆంటోనీ తట్టిల్ ను డిసెంబర్ 12న కొచ్చిలో పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పదిహేనేళ్ళుగా ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరూ పెద్దలు ఒప్పించి, ఇప్పుడు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. మరి పెళ్ళి అయిన తర్వాత కూడా కీర్తి సురేశ్ నటన కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి.
