Warangal:

Warangal: ప్రియుడితో క‌లిసి భ‌ర్తను హ‌త‌మార్చే ప్లాన్.. చికిత్స పొందుతూ వ‌రంగ‌ల్ డాక్ట‌ర్ మృతి

Warangal: భార్య‌, ఆమె ప్రియుడి చేతిలో దారుణ హ‌త్యాయ‌త్నానికి గురైన వ‌రంగ‌ల్ డాక్ట‌ర్ సుమంత్‌రెడ్డి 8 రోజులుగా చికిత్స పొందుతూ శ‌నివారం (మార్చి 1) ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ప్రియుడికి సుపారీ ఇచ్చి త‌న భ‌ర్త‌ను హ‌త్య చేయాల‌ని సుమంత్‌రెడ్డి భార్యే ఈ దారుణానికి ఒడిగ‌ట్టింది. వారి దాడిలో తీవ్ర‌గాయాల‌పాలైన డాక్ట‌ర్ ప్రాణాపాయ స్థితిలో ఆసుప‌త్రిలో చేరి ఈ రోజు ఆయన మృతిచెందారు.

Warangal: వరంగ‌ల్ హంట‌ర్ రోడ్‌లోని వాస‌వీకాల‌నీలో నివాసం ఉంటున్న డాక్ట‌ర్ సుమంత్‌రెడ్డికి 2016లో ఫ్లోరా మ‌రియాతో ప్రేమ వివాహం జ‌రిగింది. త‌న బంధువులకు చెందిన విద్యా సంస్థ‌ల‌ను ప‌ర్య‌వేక్ష‌ణ‌కు2018లో త‌న భార్య‌తో స‌హా సుమంత్‌రెడ్డి సంగారెడ్డికి వెళ్లి అక్క‌డే ఉంటున్నారు. అక్క‌డ ఫ్లోరా టీచ‌ర్‌గా, సుమంత్‌రెడ్డి పీహెచ్సీలో కాంట్రాక్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌గా చేరారు. అక్క‌డే ఉన్న స‌మ‌యంలో ఫ్లోరా జిమ్‌కు వెళ్లేది. ఈ క్ర‌మంలో ఆ జిమ్‌లో ట్రైన‌ర్ శామ్యూల్‌తో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డి, వివాహేత‌ర బంధానికి దారితీసింది.

Warangal: ఫ్లోరా, శామ్యూల్‌ వివాహేత‌ర బంధం గురించి డాక్ట‌ర్ సుమంత్‌రెడ్డికి తెలియ‌డంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వు జ‌రిగేవి. దీంతో మ‌ళ్లీ త‌మ నివాసాన్ని వ‌రంగ‌ల్‌కు మార్చారు. ఈ స‌మ‌యంలోనే ఫ్లోరాకు 2019లో జ‌న‌గామ జిల్లా పెంబ‌ర్తి సోష‌ల్ వెల్ఫేర్ క‌ళాశాల‌లో లెక్చ‌ర‌ర్‌గా ఉద్యోగం వ‌చ్చింది. ఆ త‌ర్వాత అదే క‌ళాశాల‌ను రంగ‌శాయిపేట‌కు మార్చారు.

Warangal: ఇంత‌కాల‌మైన ఫ్లోరా ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు. భ‌ర్త లేని స‌మ‌యంలో శామ్యూల్‌ను త‌న ఇంటికే పిలిపించుకునేది. ఇదే విష‌యం తెలిసి భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వు ప్రారంభ‌మ‌య్యాయి. ఇదే స‌మ‌యంలో ఫ్లోరా గట్టి నిర్ణ‌యం తీసుకున్న‌ది. త‌మ వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్న డాక్ట‌ర్‌ను లేకుండా చేయాల‌ని ప్లాన్ ఆ ఇద్ద‌రూ ప్లాన్ వేశారు.

Warangal: ప్లాన్ ప్ర‌కారం.. ఫ్లోరా త‌న బ్యాంకు ఖాతా నుంచి శామ్యూల్‌కు రూ.ల‌క్ష ఆన్‌లైన్‌లో పంపింది. దానిలో రూ.50 వేల‌ను శామ్యూల్ త‌న మిత్రుడు, హైద‌రాబాద్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌కు పంపాడు. ఈ ఒప్పందంలో రాజ్‌కుమార్‌కు ఇల్లు క‌ట్టించి ఇస్తామ‌ని శామ్యూల్, ఫ్లోరా ఒప్పుకున్నారు.

Warangal: ప‌న్నాగంలో భాగంగా శామ్యూల్, రాజ్‌కుమార్ ఇద్ద‌రూ క‌లిసి గ‌త నెల 20న రాత్రి హెల్మెట్లు ధ‌రించి వ‌రంగ‌ల్‌కు చేరుకున్నారు. కాజీపేట ప్రైవేటు ఆసుప్ర‌తిని న‌డుపుతున్న సుమంత్‌రెడ్డి విధులు ముగించుకొని కారులో ఇంటికి వెళ్లుండ‌గా, బ‌ట్టుప‌ల్లి రోడ్్‌లో కారు వెనుక భాగంలో సుత్తితో కొట్టారు. శ‌బ్దం విన్న సుమంత్‌రెడ్డి కారును ఆపి బ‌య‌ట‌కు వ‌చ్చి చూస్తుండ‌గా, అదే సుత్తితో ప‌లుమార్లు అత‌ని త‌ల‌పై బాదారు. చ‌నిపోయాడ‌నుకొని వారిద్ద‌రూ పారిపోయారు.

ALSO READ  Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం

Warangal: తీవ్ర ర‌క్త‌స్రావ‌మైన వైద్యుడు సుమంత్‌రెడ్డిని స్థానికులు 108లో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డి నుంచి హైద‌రాబాద్‌కు తీసుకెళ్లారు. అత‌డి ప‌రిస్థితి విష‌మించ‌డంతో వ‌రంగ‌ల్‌కు తీసుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై మృతుడి తండ్రి సుధాక‌ర్‌రెడ్డి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీని ప‌రిశీలించిన పోలీసులు నిందితుల‌ను గుర్తించారు. ఇంట్లోని బంగారం అమ్మేందుకు వెళ్తున్న శామ్యూల్‌, రాజ్‌కుమార్‌, ఫ్లోరా మ‌రియాల‌ను అరెస్టు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రియుడిపై మోజుతోనే భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టేందుకే భార్యే ఈ దారుణానికి ఒడిగ‌ట్టింద‌ని తేలింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *