Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొత్త సినిమాతో రానున్నారు. ఈసారి తన చిత్రం కోసం మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో ప్రస్తుతం యూత్ లో క్రేజ్ సంపాదించి దూసుకుపోతున్న హాట్ బ్యూటీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ గ్లామర్ బ్యూటీల కాంబో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. ఇంతకీ ఆ హాట్ బ్యూటీలు ఎవరు? పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Sunny Deol: సన్నీ డియోల్ జోష్: దేశభక్తి సినిమాల సునామీ!
విశాల్.. సాయిధన్సికతో నిశ్చితార్థం తర్వాత మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. విశాల్ హీరోగా సీనియర్ డైరెక్టర్ సుందర్ సీ దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘మదగదరాజ’ సినిమా హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరు కలిసి సినిమా చేస్తున్నారు. సుందర్ సి సినిమాలంటే గ్లామర్ టచ్ మాములుగా ఉండదు. ఆయన సినిమాలలో హీరోయిన్లు చాలా కీలకం. అందుకే ఈ సినిమాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న తమన్నా, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్నా ఐటెం సాంగ్స్‌తో యువతలో భారీ ఫాలోయింగ్ సంపాదించగా, కాయదు లోహర్ కూడా తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు విశాల్ పక్కన నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుందర్ సీ సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం కూడా అలాంటి వినోదాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. విశాల్ ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం ఉందని టాక్. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.