Night Shift work: ప్రస్తుత కాలంలో చాలా మంది నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తుంటారు. ఎక్కువకాలం రాత్రిపూట వర్క్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు రాత్రి పడుకునేందుకే కేటాయించాలని.. వర్క్‌ను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. నైట్ షీఫ్ట్ల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సరైన నిద్ర, క్రమరహిత ఆహారపు అలవాట్లు పెద్దలలో ఊబకాయానికి దారితీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల మొత్తం నిద్ర చక్రం చెదిరిపోతుంది. ఇది పెద్ద మార్పులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జంక్ ఫుడ్
రాత్రి ఆలస్యంగా తినడం లేదా పని సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల డయాబెటిస్, ఇతర గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
రుతుక్రమ సమస్యలు
రాత్రి షిఫ్టులలో పనిచేసే స్త్రీలకు రుతుక్రమ సమస్యలు, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఇటీవలి అధ్యయనం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read: Mushrooms: క్యాన్సర్, డయాబెటిస్తో బాధపడుతున్నారా.? అయితే పుట్టగొడుగులు తినండి
అనారోగ్యకరమైన ఆహారం
రాత్రిపూట పనిచేసేవారు టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, స్నాక్స్ తీసుకోవడం సర్వసాధారణం. కానీ అధ్యయనాలు అది శరీర కొవ్వును పెంచుతుందని చెబుతున్నాయి.
గుండె ఆరోగ్యం
రాత్రి షిఫ్ట్‌లలో నిరంతరం పనిచేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రిపూట పనిచేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బరువు పెరుగుట
రాత్రి షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల శక్తి స్థాయిలు తగ్గుతాయి. బరువు పెరిగే అవకాశం పెరుగుతుంది. రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే వ్యక్తులు సాధారణ షిఫ్ట్‌లో పనిచేసే వారి కంటే 24 గంటల్లో తక్కువ శక్తిని ఖర్చు చేస్తారు. ఇది ఊబకాయానికి దారితీస్తుందని ఓ సర్వేలో తేలింది.